జపాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ఆడుతాడని ఆసక్తిగా ఎదురుచూశానని, కానీ అతడు బెంచ్‌కే పరిమితం కావడం నిరాశ కలిగించిందని మ్యాచ్ అనంతరం కెండేల్ పేర్కొన్నాడు. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 33 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, జపాన్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.