TG: ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతుభరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు, సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా ఇస్తామని తెలిపారు.