చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం: వైద్యులు

AP: చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి రావచ్చని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రమణ యశస్వి తెలిపారు. అయితే వారు త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. అకస్మాతుగా చేతులు, కాళ్లు నీరసంగా ఉంటాయని చెప్పారు. కోనసీమ జిల్లా, నరసరావుపేట, ప్రకాశం జిల్లా నుంచి ఈ వ్యాధి బాధితులు ఇక్కడకు వచ్చారని, చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నారని ఆయన తెలిపారు. GBS గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, తాము చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్