చెన్నైలో రెండు నెలల తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రజల్లోకి వచ్చారు. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ఆయన ముఖాముఖి నిర్వహించారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా పోలీసులు 2 వేల మందికి మాత్రమే అనుమతినిచ్చారు, క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించారు. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి సొంతిల్లు ఉండాలనేది తన లక్ష్యమని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని విజయ్ అన్నారు.