TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. "బీజేపీతో కలవనని కేసీఆర్ తాను నమ్మే దేవుడి మీద ఒట్టు వేసి చెప్పగలరా" అని సవాల్ చేశారు. మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ వంటి కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. "మా ఎంపీల గొంతు బీఆర్ఎస్ వెధవలకు వినిపించడం లేదా, వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు" అంటూ ఘాటుగా స్పందించారు.