AP: తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగి, వసంత మండపంలో అభిషేక నివేదనలు అందుకుంటారు. రెండో రోజు స్వామివారు బంగారు రథంపై దర్శనమివ్వగా, చివరిరోజు సీతారామ లక్ష్మణులు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు కూడా పాల్గొంటారు.