తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం(డిసెంబర్ 8) మధ్యాహ్నం 1.30 గం. కు ఈ సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారు. 2.30 గం.కు సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాని 44 దేశాలనుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, HYD ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. సమ్మిట్ ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేక సావనీర్, వివిధ పిండివంటలతో కూడిన బాస్కెట్‌ను ఆహూతులకు అందించనున్నారు.