వారంలో నాలుగు సార్లు ఆకుకూరలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, మందుల కంటే ఇవి మేలని సూచిస్తున్నారు. మెంతి ఆకులు డయాబెటిస్‌ను నియంత్రించి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. పాలకూర ఎముకలను బలపరుస్తుంది. అయితే ఆక్సాలిక్ ఆమ్లం వల్ల వైద్యుల సలహా తీసుకోవాలి. పుదీనా కడుపు సమస్యలను తగ్గిస్తుంది. తోటకూర కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది.