మితిమీరిన వ్యాయామంతో కిడ్నీలకు ముప్పు!

జిమ్‌లో అతిగా వ్యాయామం చేయడం వల్ల 'రాబ్డోమయోలిసిస్' అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తి కిడ్నీలు దెబ్బతింటాయని AINU వైద్యులు హెచ్చరించారు. తక్కువ సమయంలో కండరాలు పెంచాలనే ఆరాటంతో 25 ఏళ్ల యువకుడు 90 నిమిషాల పాటు కఠిన వ్యాయామాలు చేయడంతో అతని కిడ్నీలు పాడయ్యాయి. మూత్రం రంగు మారడం, తీవ్ర కండరాల నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని, నెమ్మదిగా వ్యాయామం ప్రారంభించి, నీరు ఎక్కువగా తాగుతూ, నొప్పి వస్తే ఆపేయాలని వైద్యులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్