తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ !

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ నుంచి ఇంకా పిలుపు రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్‌ను కోరారు. మెజారిటీ సంఖ్యను చూపించాలని గవర్నర్ అడగగా, 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను విజయ్  అందజేశారు. ప్రమాణస్వీకారం తర్వాత బలనిరూపణ చేస్తానని విజయ్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఆహ్వానాలు, ఏర్పాట్లపై గవర్నర్ ఆరా తీశారు. గవర్నర్ నిర్ణయం కోసం టీవీకే వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

సంబంధిత పోస్ట్