తమిళనాడులో TVK చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్ తగినట్లు తెలుస్తోంది. అక్కడ డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ తమ సర్వేలో అంచనా వేసింది. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా, డీఎంకే మొత్తం 125-145 సీట్లతో అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్ పల్స్, ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. AIDMK కూటమి 65-80 సీట్లతో సరిపెట్టుకుంటుందని తెలిపాయి. అలాగే విజయ్ కేవలం 18-24 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడైంది.