దేశంలో పబ్లిక్‌ వైఫై విస్తరణ కష్టమే: TRAI

దేశంలో పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల విస్తరణకు అనేక అడ్డంకులు ఉన్నాయని TRAI వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన కన్సల్టేషన్ పేపర్‌లో ఉచిత వైఫైపై వినియోగదారుల అంచనాలే ప్రధాన సమస్యగా పేర్కొంది. భారత్‌లో ఎక్కువ మంది వినియోగదారులు 4జీ, 5జీ డేటా ప్యాక్‌లతోనే అవసరాలు తీర్చుకుంటుండటంతో, పబ్లిక్ వైఫై కోసం రూ.5 లేదా రూ.10 ఖర్చు చేయడానికైనా ఆసక్తి చూపడం లేదని ట్రాయ్ తెలిపింది. ఈ ధోరణి కమర్షియల్ హాట్‌స్పాట్ సేవల అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని అభిప్రాయపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్