తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తూ, రైతులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న మూడేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి, ప్లాంట్ పనితీరు, రైతులకు అందుతున్న సేవలను అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే 70 వేల మెట్రిక్ టన్నులకు పైగా FFB ప్రాసెస్ చేసిన ప్లాంట్ సామర్థ్యాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెంచాలని సూచించారు.