వందేభారత్‌లో కాలం చెల్లిన కూల్‌ డ్రింక్స్‌

మంగళూరు-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు కాలం చెల్లిన శీతల పానీయాలు అందించారన్న ఆరోపణలపై కేరళ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై స్వయంగా కేసు నమోదు చేసిన కమిషన్, 15 రోజుల్లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలంటూ పాలక్కాడ్ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును జూన్ 26న విచారణకు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్