యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై వివరణ.. వాట్సప్‌నకు అదనపు గడువు

వాట్సప్‌ ఇటీవల తీసుకొచ్చిన ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. ఫోన్‌ నంబర్‌ ప్రైవసీని కాపాడుతూ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, నకిలీ యూజర్‌నేమ్స్ సృష్టించి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఐటీ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని పేర్కొంటూ కేంద్రం వివరణ కోరింది. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు వాట్సప్‌కు మరో 3 రోజుల పాటు అదనపు గడువు కల్పించింది.

సంబంధిత పోస్ట్