చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు.. ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలు

AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బయట నుంచి తెచ్చిన మందుగుండు సామగ్రిని పోలీస్ స్టేషన్‌లో పరిశీలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్