మెదక్ స్టీల్ కంపెనీలో పేలుడు: ఒకరి మృతి, నలుగురికి గాయాలు

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి భయాందోళనకు గురైన కార్మికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్