రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. ఘటనాస్థలాన్ని ఎస్పీ హరీశంకర్ తన బృందంతో కలిసి పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS) ఘటనా స్థలానికి చేరుకుంని దర్యాప్తు చేస్తున్నాయి. ఫోరెన్సిక్ బృందం తనిఖీల తర్వాతే అసలు కారణం తెలుస్తుందని, ఇది పేలుడా లేక మరేదైనా ఘటననా ఇప్పుడే నిర్ధారించలేమని ఎస్పీ స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న RDXతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.