ఢిల్లీలో పేలుడు.. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన బీసీఏఎస్‌

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలను బీసీఏఎస్‌ (Bureau of Civil Aviation Security) అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, పైలట్‌ శిక్షణా సంస్థలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. సీసీ కెమెరాలను 24 గంటలపాటు నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించింది. అదనపు భద్రతా సిబ్బందిని నియమించి, ప్రతి ప్రయాణికుడు, సామానుపై కఠినంగా తనిఖీలు నిర్వహించాల‌ని బీసీఏఎస్‌ సూచించింది.

సంబంధిత పోస్ట్