జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో 'ఆశా పోస్ట్' వద్ద శనివారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో చందూసా ప్రాంతానికి చెందిన జాబిర్ అహ్మద్ బజాద్ మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పాత బాంబు షెల్‌ను తాకడం లేదా కదిలించడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.