AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట వద్ద రహదారి పనుల కోసం కొండను తొలిచేందుకు అమర్చిన జిలిటైన్ స్టిక్స్ అకస్మాత్తుగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో టీచర్, డ్రైవర్, ముగ్గురు కూలీలు సహా మొత్తం ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులను విశాఖకు చెందిన సునీత, దేవరాపల్లికి చెందిన మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్ కుమార్, ఒక డ్రైవర్గా అధికారులు గుర్తించారు.