పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు (వీడియో)

యూపీలోని కాన్పూర్ శివార్లలో భౌతి స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సబర్మతి జన్ సాధరన్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. ఇంజిన్ నుంచి ఆరవ, ఏడవ జనరల్ కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికులంతా అప్రమత్తమై రైలు నుంచి దిగేశారు.

సంబంధిత పోస్ట్