చైనా పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్‌

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి చైనాకు మద్దతు ప్రకటించారు. భారత్‌-చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాలపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్