చైనా పర్యటనకు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ వెళ్లనున్నట్లు సమాచారం. గత ఐదేళ్లలో తొలిసారిగా ఆయన చైనాలో పర్యటించనున్నారు. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. జులై 14, 15 తేదీల్లో షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) కౌన్సిల్‌తో శంకర్ సమావేశం కానున్నారు. అలాగే చైనా విదేశాంగ శాఖ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.