వివాహేతర సంబంధం.. వ్యక్తికి చెప్పుల దండ వేసి ఊరేగించారు!

అస్సాంలో ఆదివారం నాడు షాకింగ్ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఒక వ్యక్తి స్థానికులకు దొరికిపోయాడు. రంగియాకు చెందిన అజీజ్ అలీ అనే వ్యక్తి, భర్త ఇంట్లో లేని సమయంలో మరో మహిళతో అసభ్యకర స్థితిలో ఉండగా స్థానికులు పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిందితుడికి చెప్పుల దండ వేసి ఊరేగించి, అనంతరం హాజో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్