AP: పల్నాడు జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రియురాలి భర్త, ఆమెతో కలిసి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి కాలేషా వలి భార్య మనీషాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త హెచ్చరించినా, ఇల్లు మార్చినా జాకీర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన మనీషా, భర్తతో కలిసి జాకీర్‌ను హత్య చేసి, మృతదేహాన్ని రహదారి పక్కన పడేసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణలో భార్యాభర్తలే నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేశారు.