యూరప్‌ను తీవ్ర వడగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత కారణంగా సుమారు 1,300 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలు యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.