హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం 'తెలంగాణ భవన్' వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడికి చేరుకున్నారు. అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.