ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని సీసీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు. యూజర్ల డేటాబేస్ వివరాలపై ఆరా తీస్తున్న పోలీసులు, ఐబొమ్మ ద్వారా రూ. 40 కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. చివరిగా OG సినిమాను పైరసీ చేసినట్లు రవి విచారణలో తెలిపాడు.