హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ నటించిన 'F1' సినిమా కలెక్షన్లలో టాప్ గేర్‌తో దూసుకుపోతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ 2 వారాల్లో రూ.2,656 కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీస్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో తొలి రోజే రూ.5.5 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు వారాలకు దాదాపుగా రూ.70 కోట్లు సాధించింది. ఇదే జోరులో కలెక్షన్స్ కొనసాగితే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.