అమెరికా అంతటా విమాన సర్వీసులను ఎఫ్ఏఏ (FAA) నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక కమ్యూనికేషన్ వైఫల్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల 11 వేలకుపైగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగగా, వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా, 10 వేల విమానాలు ఆలస్యమయ్యాయి. గాల్లో ఉన్న 4,042 విమానాలను సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. 2001 తర్వాత అమెరికాలో దేశవ్యాప్త గ్రౌండ్స్టాప్ విధించడం ఇదే రెండోసారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.