TG: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నించారు. మంగళవారం ఆర్థిక శాఖ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనంటూ ఒక నకిలీ కాల్ ఎమ్మెల్యేకు వచ్చింది. తనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరిచయం చేసుకున్న 'దిలీప్ కుమార్' అనే వ్యక్తి ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపారు. అయితే, ఇటీవల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇలాంటి నకిలీ కాల్ వచ్చిన ఘటనను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమై, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.