TG: హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో నకిలీ పత్తి విత్తనాల భారీ దందా పోలీసుల చేతికి చిక్కింది. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ టీమ్-II, తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి, గుజరాత్‌కు చెందిన నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ కంపెనీ పేరుతో విక్రయిస్తున్న రూ. 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలను, 2,000 కేజీల పత్తి విత్తనాలను, 12,800 నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో ఉపయోగించిన ఒక మారుతి ఈకో వాహనం, 3 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.