మచిలీపట్నంలో ఫేక్ కరెన్సీ కలకలం (వీడియో)

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. తర్వాత షాపు యజమాని గమనించి.. చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజ్‌లను ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నంచి రూ.6500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన చిలకలపూడి సీఐ అబ్దుల్ నబీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్