నంద్యాల జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నకిలీ వెబ్‌సైట్లు భక్తులను మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ సైట్లలో వసతి బుకింగ్ పేరుతో బెంగళూరు, హైదరాబాద్ భక్తులు మోసపోయారు. గదులు బుక్ కాలేదని తెలుసుకుని వారు షాక్‌కు గురయ్యారు. ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ సైట్లు కూడా ఉండటంతో భక్తుల్లో భయం పెరిగింది. ఇటువంటి మోసాలకు గురికాకుండా అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే వాడాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు సూచించారు.