ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు జోగేశ్వరి వెస్ట్‌లోని యాదవ్ నగర్‌లో ఓ భారీ వృక్షం చెట్టు కూలిపోయింది. అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు, నాలుగు బైక్‌లు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వర్షాకాలానికి ముందే ప్రమాదకరమైన చెట్ల కొమ్మలను కత్తిరించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని, సిమెంట్ రోడ్ల వల్ల వేళ్లు బలహీనపడి చెట్లు కూలుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.