హార్ముజ్ జలసంధిని తెరిచేస్తామని ఇరాన్ మీడియా సూచనలు ఇవ్వడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఈరోజు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 4.8 శాతం పడిపోయి 94.85 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఇది 95.82 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (US) ఫ్యూచర్స్ కూడా 4.6 శాతం తగ్గి 89.553 డాలర్లకు పడిపోయింది. ఈ పరిణామం ప్రపంచ చమురు మార్కెట్లలో ఆందోళనను రేకెత్తించింది.