ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు అతిఉత్సాహం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలని, కానీ బీఆర్ఎస్ పాలనలో పారిశ్రామిక వేత్తలు, సినీతారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని, భార్యాభర్తల సంసారాల్లో తొంగి చూశారని, కుటుంబాలకు కుటుంబాలు నాశనం చేశారని ఆయన మండిపడ్డారు.