యూపీలోని అలీగఢ్ టప్పల్ పరిధిలోని హాజీపూర్ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తింటి వారు కోడలి ఇంటిపై దాడి చేశారు. దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతూ, తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. లోపల ఉన్న మహిళలు, కుటుంబ సభ్యులు ప్రాణభయంతో తలుపులను గట్టిగా పట్టుకుని గదిలోనే దాక్కున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.