లాడ్జిలో కుటుంబం ఆత్మహత్య.. వెలుగులోకి కీలక విషయాలు

AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య, బిడ్డ మృతి చెందగా, భర్త చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచాడు. సాతులూరుకు చెందిన కుంభా గోపి, శంకర కుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె మౌనిహ (3)కు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేకపోవడంతో దంపతులిద్దరూ ఆవేదన చెందేవారు. వారు చనిపోవాలని కొన్ని రోజుల కిందటే నిర్ణయించుకున్నట్లు వాట్సప్ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. ‘పాప, నేను కలిసి చనిపోతాం. నువ్వైనా కష్టాలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి’ అంటూ గోపి పంపిన వాట్సప్ సందేశానికి.. ‘చావైనా, బతుకైనా నీతోనే.. ముగ్గరం కలిసే చనిపోదాం’ అని భార్య సమాధానమిచ్చింది.

సంబంధిత పోస్ట్