TG: కుటుంబ కలహాలు భార్యాభర్తల ప్రాణాలు తీశాయి. ఏపీకి చెందిన వెల్పూరి శ్రీనివాసులు(28), దుర్గారాగిణి(22) భార్యాభర్తలు కాాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల క్రితం HYDకు వచ్చి మిథిలానగర్ లోని శాంతివనంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే దంపతుల మధ్య గొడవల కారణంగా బుధవారం ఉదయం దుర్గారాగిణి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాసులు భయంతో తన బావ ఇంటికి వెళ్లి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.