కుటుంబ కలహాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

TG: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. సంస్కృతి టౌన్‌షిప్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న సంతోష (26) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా.. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕