TG: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తండ్రి దాసరి కిషన్ (68) మృతి చెందగా, భార్య నాగమణి, కుమారుడు వంశీ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై రెండవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు వచ్చి చూడగా, ముగ్గురూ అపస్మాక స్థితిలో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.