ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. మెహర్ బాబు అనే వ్యక్తి మూడేళ్లుగా పెంచుకుంటున్న కోడిపుంజు వీధికుక్కల దాడిలో మృతి చెందింది. కుటుంబ సభ్యురాలిగా భావించిన ఆ కోడికి, కుటుంబ సభ్యులు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి, కర్మకాండలు జరిపించారు. కోడిపుంజు బొమ్మతో కూడిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి, విందు కూడా ఏర్పాటు చేశారు.