తన అత్త కోరిక నెరవేర్చేందుకు హరియాణాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌధరీ అరుదైన సాహసం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న 90 ఏళ్ల అత్త చంద్రీదేవిని ప్లాస్టిక్ టబ్బులో కూర్చోబెట్టి 260 కిలోమీటర్ల ‘బ్రిజ్ పరిక్రమ’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర, బృందావన్‌తో పాటు హరియాణా, రాజస్థాన్‌లోని పలు పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తున్నారు. సాధారణంగా ఈ యాత్రకు 40 రోజులు పడుతుంది. కాగా, ‘‘మా అత్తయ్య నన్ను సొంత బిడ్డలా ఆదరించింది. ఆమె రుణం తీర్చుకోవడం నా ధర్మం’’ అని కాజల్ చెప్పుకొచ్చారు.