తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకుల పట్ల అభిమానుల ప్రేమ తీవ్రత మరోసారి నిరూపితమైంది. తిరుచ్చికి చెందిన టీవీకే కార్యకర్త సుకుమార్ షణ్ముగం, తన అభిమాన నటుడు, ముఖ్యమంత్రి విజయ్‌ను దేవుడిగా భావిస్తూ ఇంట్లోని పూజా మందిరంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు అభిమానులు తమ హీరోపై ప్రేమకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఇది అతిగా మారిన అభిమానమని విమర్శిస్తున్నారు.