పాకిస్థాన్ టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులయ్యారు. సల్మాన్ అలీ ఆఘా స్థానంలో పీసీబీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు ఫర్హాన్ మాట్లాడుతూ.. స్వదేశంలో జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉందని, కొత్త సవాల్‌పై ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. జట్టుపై నమ్మకం ఉందని, సీనియర్ల అనుభవం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్-శ్రీలంక టీ20 సిరీస్ అక్టోబర్ 9 నుంచి రావల్పిండిలో ప్రారంభం కానుంది.