AP: పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ వద్ద దారుణ ఘటన వెలుగు చూసింది. ఆర్థిక అవసరాల కోసం వెంకట సత్యనారాయణ అనే రైతు అప్పుగా తెచ్చుకున్న రూ. 5 లక్షల నగదును స్కూటీ డిక్కీలో పెట్టాడు. అయితే ఉల్లిపాయలు కొనడానికి వెంకట సత్యనారాయణ ఓ షాప్ వద్ద స్కూటీని నిలిపాడు. ఈ క్రమంలోనే ఆయనకు షాక్ తగిలింది. ఆయన లోనికి వెళ్లిన కొద్దిసేపటికే గుర్తుతెలియని దుండగుడు స్కూటీ డిక్కీలోని నగదును దోచుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.