నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఓ రైతు తనపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. దశాబ్దాలుగా తాను సాగు చేసుకుంటున్న భూమిలో అధికారులు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటారని, తన ఎడ్లను తీసుకెళ్లి తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అటవీశాఖ కార్యాలయం వరకు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు.