TG: భూపాలపల్లి(D) భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన రైతు దంపతులు ఓదెలు, లలిత బర్ల షెడ్‌ను MLA సత్యనారాయణ అనుచరులు కూలగొట్టారని.. బర్లను తీసుకుని ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసుకు వచ్చాడు. ఆఫీసులోకి గేదెలు రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. MLA తమకు న్యాయం చేయాలని ఓదెలు, లలిత బైటాయించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. MLA అధికారిక నివాసంలోకి పశువులను పంపినందుకు వీరిని PSకు తరలించారు.